నిరుద్యోగులకు గుడ్ న్యూస్: SBI క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: SBI క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ.. అర్హతలు ఇవే..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.

పోస్టుల సంఖ్య: 33
పోస్టులు:

  • జనరల్ మేనేజర్(ఆడిట్) - 01
  • అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఆడిట్) - 14
  • డిప్యూటీ మేనేజర్(ఆడిట్) - 18

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్​లో బీఈ లేదా/ ఉత్తీర్ణత లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీఐఎస్ఏ, సీఈహెచ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దాదాపు 15 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:

  • జనరల్ మేనేజర్(ఆడిట్) 45 ఏండ్ల నుంచి 55 ఏండ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఆడిట్) 33 ఏండ్ల నుంచి 45 
  •  డిప్యూటీ మేనేజర్ (ఆడిట్) 25 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా... 
అప్లికేషన్లు ప్రారంభం: జులై 11.
లాస్ట్ డేట్: జులై 31 
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు sbi.co.in వెబ్​సైట్​లో  సంప్రదించగలరు.