కేంద్ర కేబినెట్ విస్తరణపై మోడీ ఫోకస్

కేంద్ర కేబినెట్ విస్తరణపై మోడీ ఫోకస్

కేంద్ర కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. జులైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు ప్రధాని. కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.  ఈనెల 11న నడ్డా, అమిత్ షాలతోనూ కేబినెట్ విస్తరణపై చర్చించారు మోడీ. రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు కూడా చేయలేదు. దాంతో కేబినెట్ విస్తరణపై ఆసక్తి ఏర్పడింది. మొత్తం 79 మంత్రులను నియమించుకోవడానికి మోడీకి అవకాశం ఉండగా... ప్రస్తుతం 53 మందే ఉన్నారు. అలాగే పీయూశ్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నరేంద్రసింగ్ తోమర్, హర్దీప్ సింగ్ లాంటి వాళ్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి అదనపు శాఖలు తొలగించి కొత్తవారిని నియమించే వీలుంది.