ఇవాళ (ఆగస్ట్ 10) బెంగళూరులో మోడీ పర్యటన.. మెట్రో రైలు, వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ ప్రారంభం

ఇవాళ (ఆగస్ట్ 10) బెంగళూరులో మోడీ పర్యటన.. మెట్రో రైలు, వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌  ప్రారంభం

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించనున్నారు. మెట్రోతో పాటు, వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైలును ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు శనివారం కర్నాటక సీఎంవో ప్రధాని పర్యటన షెడ్యూల్​ను రిలీజ్ చేసింది. మోదీ దాదాపు 4 గంటల పాటు బెంగళూరు సిటీలో పర్యటిస్తారని తెలిపింది. ఉదయం 10.30 గంటలకు ఎయిర్​పోర్టులో దిగిన తర్వాత.. హెలికాప్టర్,​ రోడ్డు మార్గంలో కేఎస్​ఆర్​ బెంగళూరు(సిటీ) రైల్వే స్టేషన్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడ వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్  రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. అమృత్‌‌‌‌సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రి, అజ్ని (నాగ్‌‌‌‌పూర్)-–పుణె మధ్య రెండు వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లను కూడా వర్చువల్‌‌‌‌గా ప్రారంభిస్తారు.