
మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ ఫ్రాన్స్ చేరుకోనున్న మోడీ… అక్కడ జరగనున్న G7 సదస్సులో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేట్ మ్యాక్రాన్ లతో సమావేశమవుతారు. రేపు ఫ్రాన్స్ నుంచి UAE వెళ్లనున్న ప్రధాని… అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ తో ….ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఏప్రిల్ లోనే మోడీకి UAE అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ జాయేద్ ను ప్రకటించింది ప్రభుత్వం. ఆ పురస్కారాన్ని ఈ పర్యటనలో మోడీ అందుకోనున్నారు. 24, 25 తేదీల్లో బహ్రెయిన్ లో పర్యటిస్తారు మోడీ. బహ్రెయిన్ లో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు నరేంద్ర మోడీ.