రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైంది : మోడీ

రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైంది : మోడీ

ఢిల్లీ : పోలీసు బలగాలను మరింత సుశిక్షితులుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అధునాతన టెక్నాలజీతో పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏజెన్సీల డేటా మార్పిడిని సులభతరం చేయడానికి నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ చాలా ముఖ్యమైందని చెప్పారు. రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైందని వివరించారు. డీజీపీ, ఐజీల అఖిల భారత సమావేశంలో పోలీసింగ్, జాతీయ భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు. డీజీపీ, ఐజీల అఖిల భారత సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరై మాట్లాడారు.