ప్రధాని పొదుపు మంత్రం.. PM కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు

ప్రధాని పొదుపు మంత్రం.. PM కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు

ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ఏడాది పాటు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా.. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రధానికి భద్రతగా ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లోని కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) సంఖ్యను పెంచాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇందు కోసం కొత్త వాహనాలను కొనొద్దని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లతో సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, జాతీయ వనరులను పరిరక్షించాలని ప్రధానమంత్రి ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో, బాధ్యతాయుతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిపాలనాపరమైన పొదుపు చర్యలు చేపట్టడం వంటి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను పరిగణిస్తున్నారు. 

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఏంటంటే..
‘‘ప్రపంచం నేడు ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంటోంది. పశ్చిమా సియా, ఉక్రెయిన్ యుద్ధంతో సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. కొవిడ్​ తర్వాత ఉక్రెయిన్​ యుద్ధంతో ఫర్టిలైజర్‌‌పై ఎఫెక్ట్​ పడింది. ఈ ఐదారేండ్లలో విపత్కర పరిస్థితుల నుంచి భారత్​గట్టెక్కింది. ఇతర దేశాల్లో ఫర్టిలైజర్​బస్తా రూ.3 వేలకు అమ్ము తున్నరు. మన దేశంలో రైతుల కు కేవలం రూ.300 కంటే తక్కువకే ఇస్తున్నాం.  పశ్చి మాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంది. గత రెండు నెలలుగా యుద్ధం జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాం తం పెరిగాయి. మనవద్ద పెట్రోల్, డీజిల్‌ను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గత రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడ కుండా నిరం తరంగా అన్ని చర్య లు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు” అని తెలిపారు.

యుద్ధం కారణంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రతి పౌరుడు కొన్ని త్యాగాలు చేయాలి. దేశ హితం కోసం ఏడాది వరకు ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లకు బంగారం కొనొద్దు.  వంట నూనెల వాడకాన్ని కనీసం 10 శాతం తగ్గించాలి.  పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలి. స్వయం సంమృద్ధి సాధించాలి.. విదేశీ మారకద్రవ్యాన్ని మనం కాపాడుకోవాలి.

ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలి. సరుకు రవాణాకు  రైల్వే సర్వీసులను వినియోగించండి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ వినియోగం పెంచండి. కొవిడ్‌‌ తరహాలో వర్క్‌‌ఫ్రమ్ హోమ్, ఆన్‌‌లైన్ మీటింగ్‌‌లకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలి.  మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి.