కాంగ్రెస్ దేశ సంపద దోచుకోవాలని చూస్తోంది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ దేశ సంపద దోచుకోవాలని చూస్తోంది: ప్రధాని మోదీ

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఇండియాకూటమి నేతలు ప్రజల సంపాదన,ఆస్తులను దోచుకోవ డంపై దృష్టిపెట్టారని అన్నారు మోదీ.దేశంలో మహిళల బంగారం ఎంతుందో లెక్కించి.. ఆ సంపదను కాంగ్రెస్ పార్టీ అందరికీ పంపిణీ చేయాలని చూస్తోందన్నారు.

గిరిజన కుటుంబాల్లో ఉన్న వెండిని  లాక్కునే ప్రయత్నం చేస్తారన్నారు. ప్రజల ఆస్తులను లాక్కునే హక్కు ప్రభుత్వాలకెక్కడిదని ప్రశ్నించారు మోదీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశసంపదపై ముస్లింలకు తొలిహక్కు ఉంటుందని హెచ్చరించారు. ప్రజల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని..ఎక్కువ మంది పిల్లలున్నవారికి పంచే కుట్ర జరుగుతుందని హెచ్చరించారు. అర్భన్ నక్సలైట్ల ఆలోచనా విధానం..మంగళసూత్రాన్ని కూడా వదలరని కామెంట్ చేశారు మోదీ.