గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సదస్సులో మోదీ డబ్బులు రిలీజ్ చేశారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ  ఫస్ట్ సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ  వారణాసికి తొలి సారి వచ్చిన మోదీ.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని మోదీ విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా మొత్తం 9 కోట్ల 26లక్షల మంది రైతుల ఖాతాల్లో 20వేల కోట్ల రూపాయలను జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ. 2వేలు జమ కానున్నాయి. 

అలాగే.. వ్యవసాయ పద్ధతులతో రైతులకు మద్దతుగా నిలుస్తూ పారా - ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన 30వేల మందికి పైగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సభ్యులకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను అందజేశారు.