మాతృమూర్తి మరణంపై ప్రధాని భావోద్వేగ ట్వీట్

మాతృమూర్తి మరణంపై ప్రధాని భావోద్వేగ ట్వీట్

మాతృమూర్తి మరణంపై ప్రధాని భావోద్వేగ ట్వీట్

తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు. 

ఇటీవల అనారోగ్యానికి గురైన హీరాబెన్‌ను.. రెండు రోజుల క్రితం అహ్మాదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు గురువారం వైద్యులు వెల్లడించినప్పటికీ ఇవాళ ఉదయం కన్నుమూశారు.