ఇవాళ వయనాడ్​కు మోదీ

ఇవాళ వయనాడ్​కు మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కేరళలో పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడి అతలాకుతలంగా మారిన వయనాడ్ ఏరియాను మోదీ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. పునరావాస కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలతో బయటపడిన వారితో మోదీ ఇంటరాక్ట్ అవుతారని అధికారులు వివరించారు. 

శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ కన్నూరు చేరుకుంటారని, అక్కడి నుంచి ఏరియల్ సర్వే చేస్తారని తెలిపారు. రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన వారితో మాట్లాడతారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారని వివరించారు. అనంతరం సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న అధికారులతో మోదీ రివ్యూ చేస్తారని, ఈ ఘోరం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు.