ముగిసిన ప్రధాని టూర్.. ఇండియాకు వచ్చేసిన మోదీ

ముగిసిన ప్రధాని టూర్.. ఇండియాకు వచ్చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ టూర్‌‌‌‌ ముగిసింది. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఫ్రాన్స్‌‌లో పర్యటించిన ప్రధాని.. శనివారం యూఏఈకి వెళ్లారు. అబుదాబీకి చేరుకున్న మోదీకి ఎయిర్‌‌‌‌పోర్టులో యూఏఈ ప్రెసిడెంట్ షేక్‌‌ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్‌‌’‌‌ను ప్రధాని స్వీకరించారు. 

అబుదాబి/పారిస్: మూడు రోజుల విదేశీ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాకు తిరిగి వచ్చారు. గురు, శుక్రవారాల్లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన ప్రధాని.. శనివారం యూఏఈకి వెళ్లారు. అబుదాబీకి చేరుకున్న మోదీకి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో యూఏఈ ప్రెసిడెంట్ షేక్‌‌‌‌‌‌‌‌ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌ను ప్రధాని స్వీకరించారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ‘ఖాసర్ అల్ వతన్’ వద్ద మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యూఏఈ అధ్యక్షుడు స్వాగతం కలికారు. తర్వాత వీరిద్దరూ కలిసి సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర చర్చలు జరిపారు. లోకల్‌‌‌‌‌‌‌‌ కరెన్సీల్లో ట్రేడ్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు, ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌తో లింక్ చేసేందుకు, అక్కడ ఐఐటీ -ఢిల్లీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు.

భేటీ తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. గత ఏడాది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేసినప్పటి నుంచి ఇండియా - యూఏఈ వాణిజ్యం 20 శాతం వృద్ధి సాధించిందని ప్రధాని అన్నారు. ‘‘ఇరు దేశాల కరెన్సీల్లో ట్రేడ్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం చేసుకున్న ఒప్పందం.. రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారం, పరస్పర నమ్మకాన్ని చూపుతున్నది. ఇకపై యూఏఈ, భారత్ మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరిగేలా ఓ అంగీకారానికి వచ్చాం. దీని వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతాయి” అని అన్నారు. యూఏఈ ఆధ్వర్యంలో ఈ ఏడాది చివర్లో జరిగే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ (కాప్ 28)లో పాల్గొనాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. కాప్ 28కు తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రధాని చెప్పారు. 


ఫ్రాన్స్​లో మన కంటింజెంట్‌‌‌‌‌‌‌‌ను  చూడటం అద్భుతం

ఫ్రాన్స్ పర్యటన చిరస్మరణీయమైనదని మోదీ అన్నారు. బాస్టిల్లె డే వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడంతో ఇది మరింత ప్రత్యేకంగా మారందని చెప్పారు. పరేడ్‌‌‌‌‌‌‌‌లో భారత బృందం గర్వించదగిన స్థానాన్ని పొందడం అద్భుతంగా ఉందని అన్నారు. అసాధారణమైన ఆతిథ్యం ఇచ్చినందుకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఫ్రెంచ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియాజేశారు. ఇండియా, ఫ్రాన్స్ మధ్య స్నేహం కొనసాగాలని ఆకాక్షించారు. ఈ మేరకు పరేడ్ ఫొటోలు, వీడియోను మోదీ ట్విట్టర్​లో షేర్ చేశారు.