నారీశక్తి గురించి మాట్లాడేవాళ్లు.. చేసేవి ఇలాంటి పనులా?

నారీశక్తి గురించి మాట్లాడేవాళ్లు.. చేసేవి ఇలాంటి పనులా?
  • బిల్కిస్ బానో రేప్ కేసు దోషుల విడుదలపై రాహుల్ ఫైర్ 

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ సర్కార్ విడుదల చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. మోడీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఐదు నెలల గర్భిణిని రేప్ చేసి, ఆమె బిడ్డను చంపేసినోళ్లను ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ విడుదల చేశారు. నారీశక్తి గురించి మాట్లాడేవాళ్లు ఇలాంటి నిర్ణయాలతో దేశ మహిళలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రధానమంత్రి జీ.. మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను దేశం మొత్తం గమనిస్తోంది” అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. దోషులను బీజేపీ సర్కార్ విడుదలచేయడం అన్యాయం కాదా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. 

కేంద్రాన్ని అడిగారా? లేదా?

సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తుచేసిన కేసుల్లో కేంద్ర అనుమతిలేకుండా రాష్ట్రాలే సొంతం గా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. ‘‘దోషులను విడుదల చేసే ముందు కేంద్రాన్ని గుజరాత్ సర్కార్ అడిగిందా? లేదా? ఇది గుజరాత్ సీఎం సొంత నిర్ణయమైతే  ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.