
దేశ రాజధాని ఢిల్లీలో వికసిత్ భారత్ థీమ్ తో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించారు. 40 కోట్ల మంది పోరాడి సాధించిన సేచ్ఛా, సాతంత్య్రాన్ని.. ఇప్పుడు 140 కోట్ల మంది సాకారం చేయాలని అన్నారు. దేశం కోసం, స్వాత్రంత్ర్యం, స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
స్వతంత్ర సమరయోధులకు దేశం రుణపడి ఉందన్నారు. భారత్ ప్రస్థానం స్పూర్తిదాయకమని.. ప్రపంచంలో భారత్ ఇప్పుడు శక్తివంతంగా మారిందని ప్రధాని అన్నారు. G 20 సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. దేశ ప్రజలకు స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంశులు చెప్పారు ప్రధాని.
లక్ష్యాన్ని నిర్థేశించుకొని ముందుకు సాగాలని దేశ ప్రజలకు మోదీ సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్య మన్నారు. ఇటీవల ప్రకృతి విపత్తులతో దేశం చాలా నష్టపోతుందని.. విపత్తులో నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. సంస్కరణలతో ప్రజల జీవితాలు మారతాయని.. న్యావ వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు ప్రధాని. బ్యాకింగ్ రంగాన్ని పటిష్టం చేశామన్నారు. ఆర్థిక వ్యవస్థకు మంత్రంగా ఒకల్ ఫర్ లోకల్ నినాదం పని చేస్తుందని ఆయన తెలిపారు. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్ గా మారాలని అన్నారు మోదీ.
వరుసగా ఏడో సారి పంద్రాగస్టు వేడుకల్లో ఎర్రకోటపై నరేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. భారీగా పోలీసులు, బద్రతా బలగాలు మోహరించారు. రాజ్ ఘాట్ లోని మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ముందుగా త్రివిధ దళాల వందనం స్వీకరించారు. తర్వాత ప్రధాన మంత్రి మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎరగవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు.