బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. దళితబంధు కమిషన్​లో కేసీఆర్కు వాటా

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. దళితబంధు కమిషన్​లో కేసీఆర్కు వాటా

మన్​కీబాత్​ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ప్రజలతో మమేకమవుతున్నారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు.  ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.  మన్​ కీబాత్​ కార్యక్రమం వంద ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యలపై ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు. మన్​కీ బాత్​ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజలను, విద్యార్థులను, వారి తల్లి దండ్రులను చైతన్యం చేయడం కోసమే ఈ కార్యక్రమని తెలిపారు.  హరి ప్రసాద్, చింతల వెంకట్ రెడ్డి, అహ్మద్ పాషానీ తదితర స్ఫూర్తివంతమైన వ్యక్తులను దేశానికి మోడీ పరిచయం చేశారన్నారు. 

మోడీకి పూర్తి భిన్నంగా కేసీఆర్ 

సీఎం కేసీఆర్ పని మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి భిన్నంగా ఉందని అన్నారు. కేసీఆర్​కి తినడం, తాగడం, పడుకోవడం ఇవే తప్ప ప్రజల సమస్యలపై ఆయనకు పట్టింపు లేదని విమర్శించారు. వర్షాల వల్ల చిన్నారి చనిపోతే కనీసం పట్టించుకోవట్లేదని అన్నారు.  

ముఖ్యమంత్రి ఎవరైనా డూమ్​లు తీసేసే పరిపాలన..

వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.  ఆ తరువాత సీఎం ఎవరైనా ఆ డూమ్​లు కూల్చే వరకు సచివాలయంలో అడుగు పెట్టనని పేర్కొన్నారు.  అది తనకు సచివాలయం లాగా కనబడట్లేదని చెప్పారు.

దళితబంధు కమిషన్​లో కేసీఆర్​కు వాటా..

దళితబంధు నిధుల్ని భారాస ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని స్వయాన సీఎంనే ఒప్పుకున్నారని బండి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేసీఆర్​కి కూడా వాటి ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు.  మంత్రులను సైతం ముఖ్యమంత్రి కలవడని అన్నారు.