సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలి

సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలి

ప్రిన్స్, నరేష్ అగస్త్య హీరోలుగా శివ శేషు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కలి’. కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌ సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించినట్టు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తే అర్థమవుతోంది. టీమ్ ఎఫర్ట్ ఇందులో కనిపిస్తోంది. అందరికీ ఆల్ ది బెస్ట్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు.  ట్రైలర్‌‌ కంటెంట్‌ విషయానికొస్తే.. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు శివరామ్ (ప్రిన్స్‌‌‌‌‌‌‌‌).

ప్రేమించి పెళ్లాడిన భార్య కూడా పాపను తీసుకుని వెళ్లిపోతుంది.  దీంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. ఆ రాత్రి తన ఇంటికి వచ్చిన అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వల్ల శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలతో ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు.  ‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు...’ అంటూ ప్రియదర్శి చెప్పిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది.  అక్టోబర్ 4న సినిమా విడుదల కానుంది.