viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..

viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..

వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కొంతమంది గవర్నమెంట్ టీచర్ల పిల్లలకు పాఠాలు సరిగా చెప్పరు. ఎదిగే వయసులో పిల్లల భవిష్యత్ వాళ్ల చేతిలో పెడితే వాళ్లు నిర్లష్యంగా వ్యవహరిస్తారు. అలాంటి వారి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని జాయిన్ చేయించడానికి తల్లదండ్రులు భయపడుతున్నారు.  ఎంత ఖర్చైయినా ఫీజులు కట్టి ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. అలాఅని వారైనా సరిగా పిల్లలకు పాఠాలు చెప్తున్నారా అంటే అదీ లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన చూస్తుంటే స్కూల్ టీచర్లు వాళ్ల డ్యూటీ ఎంత నిర్లష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లోని దాదామౌ ప్రైమరీ స్కూల్‌లోని ప్రిన్సిపల్ సంగీతా సింగ్‌ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పకుండా.. వంటగదిలో కూర్చొని ఫేషియల్ చేయించుకుంటుంది. ఇదంతా ఓ టీచర్ ఫోన్ లో వీడీయో రికార్డ్ చేసింది. దీంతో ఆమె వీడియో తీస్తున్న టీచర్ అనమ్ ఖాన్ ని ఇటుకతో కొట్టి, వెంటపడి చేతిని కొరికింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రిన్సిపల్ పై మండిపడుతున్నారు. టీచర్ అనమ్ ఖాన్ తనపై దాడి చేసినందుకు బిఘపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రిన్సిపల్ సంగీతా సింగ్‌ పై కంప్లెయింట్ చేసింది.  వీడియో వైరల్ కావడంతో బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ ఘటన పై ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ప్రిన్సిపల్ పై యాక్షన్ తీసుకుంటామని అన్నారు.