మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యతనివ్వాలి : రాజేశ్వర్ యాదవ్

మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యతనివ్వాలి : రాజేశ్వర్ యాదవ్

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో  బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  రాజేశ్వర్ యాదవ్  కోరారు.  జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణలో 50 శాతం మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రాలు పంపించామన్నారు.

తొందరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లో  బీసీలకు 50  శాతం ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.  నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలను నియమించాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.