భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వ‌ల్ల‌నే గాంధీ ఆసుప‌త్రిలో ఖైదీలు ప‌రారీ

భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వ‌ల్ల‌నే గాంధీ ఆసుప‌త్రిలో ఖైదీలు ప‌రారీ

హైద‌రాబాద్: మూడంచెల భద్రత ఉన్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుండి ఖైదీలు పారిపోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పారిపోయిన ఖైదీలు కరోనా రోగులు కావడంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

గాంధీలో లాక్ డౌన్ మొదలైన కొత్తలోనే డాక్టర్ల పై రోగులు దాడి చేయడంతో వైద్యులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. వెంటనే డీజీపీ, సీపీ, డీసీపీ లు రంగంలోకి 250మంది పోలీసులతో మూడంచెల భద్రత చేపట్టారు. కానీ ఇంత భద్రత ఉన్నా.. ఖైదీల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రతా వెఫల్యం వల్లనే కేవలం బెడ్ షీట్లనే తాడులుగా తయారు చేసి ఖైదీలు పారిపోయారు. గాంధీ వెనుక వైపు కిటికీ గ్రిల్స్ తొలగించి దూకి పారి పోయినట్లు పోలీసులు గుర్తించారు. వెనుక వైపు ఉన్న సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గాంధీ వెనుకవైపు మూసివేసి ఉన్న గేట్ దూకి పద్మారావు నగర్ లో నుండి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. డీసీపీ కలమేశ్వర్, ఏసీపీ వెంకటరమణ గాంధీ ఆసుపత్రికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 24గంటలలో నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు