
పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్జమీన్’ (Sarzameen). ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. జియోహాట్‌స్టార్‌లో జులై 25 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.
దేశభక్తి కథాంశంతో కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడు పృథ్విరాజ్ సుకుమారన్. అతని భార్య మీరా పాత్రలో కాజోల్, కొడుకు హర్మన్ పాత్రలో ఇబ్రహీం నటించారు. ఓవైపు ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షిస్తూ, మరోవైపు తన కొడుకు సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేసే తండ్రిగా పృథ్విరాజ్ కనిపించాడు.
ప్రస్తుతం ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. తండ్రి, కొడుకు అనే ఎమోషన్కు దేశభక్తిని జోడించిన థ్రిల్లర్ అంశాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇది హిందీ ఒరిజినల్ ఫిల్మ్ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ ఎగబడి మరి చూస్తున్నారు. ఇండియాలో తెలుగులో నెంబర్ వన్ మూవీగా స్ట్రీమ్ అవుతోంది. హిందీలో 'స్పెషల్ ఓపీఎస్ 2' తర్వాత సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. తమిళంలో టాప్ 6లో ఉంది.
ఈ మూవీతో నటుడు బోమన్ ఇరానీ కొడుకు కాయోజ్ ఇరానీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కీలకపాత్ర పోషించడం విశేషం. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు.
No matter the language, the impact stays the same#Sarzameen now streaming, only on #JioHotstar#SarzameenOnJioHotstar pic.twitter.com/HpzWD6F4pG
— JioHotstar (@JioHotstar) July 27, 2025
కథేంటంటే:
కల్నల్ విజయ్ మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటాడు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే ధైర్య వంతుడు. అతని కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీఖాన్)ని కూడా తనలాగే చేయాలి అనుకుంటాడు.
కానీ.. అతను నత్తిగా మాట్లాడుతూ, పిరికివాడిలా ఉంటాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఆ దూరాన్ని తగ్గించేందుకు విజయ్ భార్య మెహర్ (కాజోల్) ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఒకసారి విజయ్ ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకుంటాడు. అందుకు బదులుగా మరికొందరు ఉగ్రవాదులు హర్మన్ ను కిడ్నాప్ చేస్తారు.
ఇందుకు విజయ్ పట్టుకున్నవాళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే హర్మన్ ని చంపేస్తామని బెదిరిస్తారు. కానీ, విజయ్ వాళ్ల డిమాండ్ కు ఒప్పుకోడు. ఈ క్రమంలో కొడుకు టెర్రిరిస్ట్గా మారాడాని అనుమానపడతాడు. మరి విజయ్ అనుమానంలో నిజం ఉందా? ఆ తర్వాత ఏం జరిగింది? అతని కొడుకు హర్మన్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.