Prithviraj Sukumaran: ఆడు జీవితం..మేం అలాంటి సీన్‌ అస్సలు షూట్ చేయలేదు:పృథ్వీరాజ్‌ క్లారిటీ

Prithviraj Sukumaran: ఆడు జీవితం..మేం అలాంటి సీన్‌ అస్సలు షూట్ చేయలేదు:పృథ్వీరాజ్‌ క్లారిటీ

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ(Blessy) తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్ లైఫ్‌‌’ (ఆడు జీవితం).విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజయింది.మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు.

ఇదిలా ఉండగా,ఈ మూవీకి సంబంధించిన ఓ కాంట్రవర్సీ సీన్​ ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారి తీసింది.‘గోట్ డేస్’లో రాసిన విధంగా ఓ వివాదాస్పద సన్నివేశాన్ని మేకర్స్ షూట్‌ చేశారని..ఆ సీన్ని సెన్సార్‌ ఒప్పుకోకపోవడంతో తొలగించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది. దీంతో తాజాగా ఇదే విషయంపై హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు. 

"తాము అలాంటి సీన్స్ని షూట్  చిత్రీకరించలేదని వెల్లడించారు. ‘‘మేం అలాంటి సీన్‌ అస్సలు చేయలేదు. తన సినిమాలో హీరో పాత్ర అలా ప్రవర్తించకూడదని మా దర్శకుడు బ్లేస్సీ భావించాడు. 2008లో బ్లెస్సీ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు.. ఆ పాత్రకు ఏవిధంగా తగిన న్యాయం చేయాగలను అని ఆలోచించా. రాసిన నవల ప్రకారం ఆ పాత్రను నేను అర్థం చేసుకోవాలా? లేదా డైరెక్టర్ బ్లెస్సీ చెప్పిన విధంగా ఊహించుకోవాలా? అని తొలుత గందరగోళం నాలో మొదలైంది. ఇక చివరకు నేనూ - బ్లెస్సీ ఒక నిర్ణయానికి వచ్చి..అన్ని రకాలైన ఆడియన్స్ కు చేరువయ్యేలా ఈ సినిమాని తీర్చిదిద్దాం’’ అని  పృథ్వీరాజ్‌ వెల్లడించారు. 

దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ దాదాపు 31 కిలోల బరువు తగ్గారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం దాదాపు 72 గంటలపాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగి నటించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక సినిమా రిలీజైన తర్వాత ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు భారీ స్థాయిలో దక్కాయి. దాదాపు అన్నిమీడియా నుంచి కూడా రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. చివరికి బుక్ మై షోలో 9.5 రేటింగ్ కూడా వచ్చింది. కానీ దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాలేదు. అయితే, సక్సెస్ అంటే కేవలం డబ్బులే కాదు..మనసుని హత్తుకునే ఆదరణ కూడా!