నేడు ప్రైవేటు ఆస్పత్రుల బంద్​

నేడు ప్రైవేటు ఆస్పత్రుల బంద్​

హైదరాబాద్, వెలుగు: ఆయుర్వేద డాక్టర్లు కూడా సర్జరీలు చేయడానికి పర్మిషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రైవే టు ఆస్పత్రులు శుక్రవారం బంద్ పాటించనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  అత్యవసర మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేయనున్నాయి. పలు విభాగాలకు చెందిన ఆయుర్వేద పీజీ డాక్టర్లకు 58 రకాల సర్జరీలకు అను మతినిస్తూ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ( సీసీఐఎం ) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆయుర్వేదాన్ని, అల్లోపతిని కలిపితే ‘మిక్సోపతి’ అవుతుందని, దీనిని ఒప్పుకోమని ఐఎంఏ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ అన్నారు . అఖిల భార త ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పన్యల శ్రావణ్ కుమార్ రెడ్డి , ప్రతినిధి డాక్టర్ జె.గీతారెడ్డి కూడా సీసీఐఎం నోటిఫికేషన్‌‌‌‌ను వ్యతిరేకించారు .