పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌ అద్దెకు తీసుకున్నరు

పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌ అద్దెకు తీసుకున్నరు
  • ఢిల్లీ – ముంబైకు తెచ్చేందుకు రూ.9.06లక్షలు
  • ఒక్కో జంతువుకు రూ.1.6 లక్షలు టికెట్‌

ముంబై: మన ఇంట్లో ఏదైనా జంతువు, పక్షిని పెంచుకుంటే దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. మన ఇంట్లో మనిషిలాగా భావిస్తాం. ఆ జంతువులు కూడా మనపై అంతే ప్రేమగా ఉంటాయి. వాటికి బాగా అలవాటైన వారు కనిపించకపోయినా.. రోజు అన్నం పెట్టేవాళ్లు లేకపోయినా దిగులు పెట్టుకుంటాయి. అలాంటిది ఈ కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్‌, ట్రావెల్‌ రెస్ట్రిక్షన్స్‌ కారణంగా చాలా మంది వివిధ ప్రదేశాల్లో ఇరుక్కుపోయారు. పెంపుడు జంతువులు కూడా వారి యజమానుల నుండి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రైవేట్‌ జట్‌ను ఏర్పాటు చేశారు. ఒక ఫ్లైట్‌లో 6 పెట్స్‌ను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. దాని కోసం రూ.9.06లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో జంతువుకు టికెట్‌ రూ. 1.6 లక్షలని ఫ్లైట్‌ ఏర్పాటు చేసిన వ్యక్తులు చెప్పారు. ముంబైకి చెందిన సైబర్‌‌ సెక్యూరిటీ రిసర్చర్‌‌ దీపికా సింగ్‌ దీన్ని ప్లాన్‌ చేశారు. ఢిల్లీ నుంచి కొంత మంది చుట్టాలు ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు పెట్స్‌ను అనుమతించలేదని, దీంతో ఈ “ ఆప్‌పెట్‌” ప్రైవేట్‌ జట్‌ ఐడియా వచ్చిందని దీప్తీ చెప్పారు. “ కొంత మంది వాళ్ల పెట్స్‌తో ట్రావెల్‌ చేయాలనుకున్నారు. కానీ తోటి ప్రయాణికులు దాన్ని వ్యతిరేకించారు. అందుకే మరో జెట్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేశాను అని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఇరుక్కున పెట్స్‌ను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రైవేట్‌ కంపెనీని కాంటాక్ట్‌ అయితే వాళ్లు ఫ్లైట్‌ అరేంజ్‌ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు పెట్స్‌ ఢిల్లీ నుంచి ముంబై వరకు వచ్చేందుకు టికెట్లు బుక్ అయ్యాయని, మిగతా రెండు సీట్లు ఫుల్‌ అయిన వెంటనే ఫ్లైట్‌ బయలుదేరుతుందని ఆమె అన్నారు. ఒక వేళ ఆ రెండు సీట్లు ఫిల్‌ కాకపోతే.. నాలుగు పెట్స్‌ను తీసుకొస్తామని, దానికి ఎక్స్‌ట్రా చార్జ్‌ చేస్తామని దీప్తీ అన్నారు. పెట్స్‌ను తరలించే ఫ్లైట్‌లో అన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకుంటామని ఎక్రిషన్‌ ఏవియేషన్‌ ఓనర్‌‌ రాహుల్‌ ముచ్చాలా చెప్పారు. వాటిని బోన్లలో పెట్టి తీసుకొస్తామని, ఫ్లైట్‌లోకి తీసుకొచ్చే ముందు స్క్రీనింగ్‌ చేశాకే అనుమతిస్తామని అన్నారు.