ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి

ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి
  • ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీ గవర్నమెంట్ ఆదేశం

న్యూఢిల్లీ: లాక్ డౌన్ సమయంలో ఫీజులు పెంచరాదని ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీలోని ఆప్ సర్కారు ఆదేశించింది. స్కూళ్లు రీఓపెన్ అయ్యేవరకు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా శుక్రవారం అన్నారు. “కొన్ని స్కూళ్లు ఫీజులు పెంచాయని, లాక్ డౌన్ ఉన్నా ట్రాన్స్ పోర్టు ఫీజులు వసూలు చేస్తున్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీజులు పెంచరాదు. ట్యూషన్ ఫీజు మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి” అని స్పష్టం చేశారు. ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా నెలలవారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. స్కూళ్లు తమ స్టాఫ్ కు జీతాలు చెల్లించాల్సిందేనన్నారు. ఫీజు కట్టలేదని స్టూడెంట్స్ ను ఆన్ లైన్ క్లాస్ లకు అనుమతించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.