ఖమ్మంలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వలే..!

ఖమ్మంలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వలే..!

ఖమ్మం, వెలుగు : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఖమ్మంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. నగరంలోని పలుచోట్ల ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ఇవ్వకుండా యథావిధిగా తరగతులు చెబుతున్నారు. 

గత నెలలో భారీ వర్షాల కారణంగా అదనపు సెలవులు ఇవ్వడం వల్ల క్లాసులు వెనుకబడ్డాయని, అందుకని ఇప్పుడు స్కూల్స్ నడిపిస్తున్నామని మేనేజ్​మెంట్లు చెబుతున్నాయి. అయితే విద్యార్థి సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులపై వివక్షత ఎందుకని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.