నాన్ టీచింగ్ స్టాఫ్ ను తీసేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు

నాన్ టీచింగ్ స్టాఫ్ ను తీసేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు

బడికి దూరం.. బతుకు భారం..
సిటీలో 62వేలకు మందికిపైగా ఎంప్లాయీస్
కొత్త జాబ్లూ దొరకని పరిస్థితి
ఇల్లు గడవడం లేదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ టీచింగ్ రూట్లో వెళ్తున్నాయి . బడులుంటే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కి వర్క్ ఉండేది. ఇప్పట్లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో నాన్ టీచింగ్ స్టాఫ్ ను మేనేజ్మెంట్స్ టెర్మినెట్ చేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ ఆఫ్ శాలరీ ఇస్తున్నా యి. సిటీలో 62 వేలకి పైగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండగా, ఇప్పుడు ఇంటి ఖర్చులకూ కష్టమవుతోంది ఆవేదన చెందుతున్నారు.

వర్క్ లేదంటూ…
సిటీలో 4వేలకు పైగా ప్రైవేట్ స్కూల్స్ ఉండగా, ఒక్కో స్కూల్లో 10 నుంచి 15 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు. వారిలో పీఈటీ, కంప్యూటర్ ల్యాబ్ టీచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీ పర్సన్, ఆయాలు, అటెండర్లు ఉన్నారు. చాలామంది బతుకు దెరువుకు సిటీకి వచ్చి అద్దె ఇండ్లల్లో ఉంటున్నవాళ్లే. ప్రస్తుతం స్కూల్స్ రన్ అవకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు మినహా మేనేజ్మెంట్లు మిగతా స్టాఫ్ ను తొలగిస్తున్నా యి. జాబ్ పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పీఈటీలు, ఇతర సిబ్బంది చెప్తున్నారు. మార్చి నుంచి సగం జీతాలే ఇచ్చారని, ఇప్పుడు అవి కూడా లేకపోవడంతో రోజు గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. వేరే ఏదైనా జాబ్ కు ట్రై చేద్దామన్నా దొరకడం
లేదని చెప్తున్నారు.

రోడ్డున పడ్డట్లు అయింది
ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసుల ద్వారా కమర్షియల్ బేసిస్ లో పని చేస్తూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. టీచింగ్, సిలబస్ పైనే ఫోకస్ అని చెప్తున్నాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ పట్టించుకోవడం లేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ పరిస్థితి రోడ్డున పడ్డట్టు అయింది.
‑ డా.సోమేశ్వర్, పీఈటీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్

చాలా ఇబ్బందిగా ఉంది
ఓ ప్రైవేట్ స్కూల్లో 15 ఏండ్లుగా పీఈటీగా చేస్తున్నా. మార్చిలో ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్లో ఆఫ్ శాలరీ ఇచ్చారు. ఆ తర్వాత బంద్ పెట్టారు. స్టూడెంట్స్ ఫీజులు వసూలైతే ఇస్తామంటున్నారు. ఇప్పటికే చాలా స్కూళ్లు పీఈటీలను తొలగించాయి. చాలా ఇబ్బందిగా ఉంది.
‑ విఘ్నేశ్, పీఈటీ

For More News..

ఆక్స్‌ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్

అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు