మన దేశంలో హ్యాపీ సిటీ ముంబై : కలల సిటీ అంటే ఎందుకంత ఇష్టం అంటే..!

మన దేశంలో హ్యాపీ సిటీ ముంబై : కలల సిటీ అంటే ఎందుకంత ఇష్టం అంటే..!

ముంబై కలల నగరంగా భారతదేశంలో అందరికీ పరిచయం. ఈ మహానగరం ఇప్పుడు “హ్యాపీ సిటీ” అని కూడా పేరుతెచ్చుకుంది. టైమ్ అవుట్ సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో ముంబై ఆసియాలోనే హ్యాపీయెస్ట్ సిటీగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 18వేల మందిపై జరిగిన ఈ అధ్యయనంలో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. 

ప్రధానంగా ఈ సర్వేలో ముంబై ప్రజల ఆనందానికి గల కారణాలను విశ్లేషించారు. 94% మంది నగరం తమకు ఆనందాన్ని ఇస్తుందనిని తెలిపారు. 89% మంది ఇతర నగరాలతో పోల్చితే ముంబైలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నామని చెప్పారు. 88% మంది ఇటీవల సంవత్సరాల్లో నగర ఉత్సాహం ఇంకా పెరిగిందని అన్నారు. అలాగే 87% మంది ముంబై ప్రజలు సహజంగానే ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

ముంబై నగరంలోని సంస్కృతి, నైట్ లైఫ్, బాలీవుడ్ సినీ పరిశ్రమ, ఉద్యోగావకాశాలు, స్ట్రీట్ ఫుడ్ వంటివి నగరానికి ఆ లైఫ్, ఉత్సాహాన్ని అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని వీధుల్లోని ప్రతి మూల, ప్రతి మూలకూ జీవం నింపే మానవతా స్పర్శ కనిపిస్తుంది.

టాప్-10 సిటీల లిస్ట్..

2025 సంవత్సరానికి ఆసియాలోని టాప్ 10 హ్యాపీ సిటీల జాబితాలో ముంబై అగ్రస్థానం దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో బీజింగ్, షాంగై, చియాంగ్ మై, హనోయ్, జకార్తా, హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, సియోల్ నిలిచాయి. ఈ సారి టోక్యో, సింగపూర్, సియోల్ నగరాలు వెనుకబడ్డాయి. టోక్యోలో కేవలం 70% మంది మాత్రమే నగరం తమకు ఆనందం ఇస్తుందని స్పందించగా.. అక్కడి వేగవంతమైన జీవనశైలి, వర్క్-లైఫ్ బాలెన్స్ ప్రధాన లోపంగా ఉన్నట్లు వెల్లడైంది.

►ALSO READ | Rupay credit card: యూపీఐ మద్దతుతో దూసుకుపోతున్న రూపే క్రెడిట్ కార్డ్స్

సముద్ర తీరాన మెరుస్తున్న మెరైన్ డ్రైవ్ నుంచి వేడి వేడి వడపావ్ సువాసన వరకు.. ముంబై ప్రతి రోజూ జీవించే ప్రతి ఒక్కరికి చిరునవ్వు పంచుతోంది. ఈ ఉత్సాహమే ఇప్పుడు ముంబైకి ఆసియాలో ఆనంద రాజధాని బిరుదు తెచ్చిపెట్టింది.