హైదరాబాద్ మియాపూర్లో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముఠా.. ఒడిశా, ఏపీకి చెందిన నలుగురు అరెస్టు

హైదరాబాద్ మియాపూర్లో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముఠా.. ఒడిశా, ఏపీకి చెందిన నలుగురు అరెస్టు

హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల ముఠా పెచ్చుమీరిపోతోంది. ఎంత మందిని అరెస్టు చేస్తున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా అమ్మేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2025 నవంబర్ 7 వ తేదీన హ్యాష్ ఆయిల్ ను అమ్ముతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. 

మియాపూర్ అల్విన్ కాలనీ లో హ్యాష్ ఆయిల్ ను అమ్ముతున్న ముఠా ను అదుపులోకి తీసుకున్నారు  మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. హ్యాష్ ఆయిల్ అమ్ముతున్నట్లు విశ్వనీయ సమాచారం తో రంగంలో కి దిగిన మాదాపూర్ ఎస్ఓటీ టీం.. ఒడిశా కు చెందిన సోనియాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సోనియా ప్రధాన సరఫరాదారుడుగా, అతనికి సహాయం చేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన  లక్ష్మీ, దుర్గా ప్రసాద్, దుర్గను అరెస్ట్ చేశారు. 

 పట్టు పడ్డ వారి వద్ద నుండి 3లక్షల విలువ చేసే 1.6 కేజీ ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును యాపూర్ పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ టీం. మియాపూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.