
బోథ్(సొనాల), వెలుగు: ఓ ప్రైవేట్‌బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నేపాల్వాసులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి మహారాష్ట్ర మీదుగా నేపాల్ వెళ్తోంది.
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం సాకెర గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలో టైర్లు దిగబడి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు నేపాల్‌వాసులు గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని పరామర్శించారు. బాధితులను అంబులెన్స్‌లో బోథ్ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.