
చెన్నై సుందరి త్రిష స్పీడుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. ‘పొన్నియన్ సెల్వన్’ పుణ్యమా అని ఈ హీరోయిన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ప్రాజెక్ట్‌లో ఓ కుర్ర హీరోయిన్ చేరినట్టు తెలుస్తోంది. ఇటీవల సంతోష్ శోభన్‌తో ‘కళ్యాణం కమనీయం’ సినిమాలో మెరిసింది ప్రియా భవానీ శంకర్. లారెన్స్‌తో తమిళ రీమేక్ రుద్రన్తో హిట్టందుకుంది.
ఇప్పుడు ఏకంగా త్రిష సినిమా ఆఫర్ ను కొట్టేసినట్టు తెలుస్తోంది. దళపతి విజయ్ 68వ సినిమాలో త్రిష నటిస్తోందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ప్రియా పేరు కూడా చేరింది. అయితే, త్రిష ప్లేస్‌ను అ బ్యూటీ రీప్లేస్ చేసిందా.. లేక ఇద్దరూ సినిమాలో నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియన్ 2లో ఈ హీరోయిన్ కీ రోల్లో నటిస్తోంది. సత్యదేవ్ సినిమాతో పాటు మరో ఐదు సినిమాలతో బిజీగా ఉంది.