ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్‌తో ఆకట్టుకునేలా ‘ప్రేమంటే’ సినిమా ఉంటుందని హీరో ప్రియదర్శి చెప్పాడు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈచిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రేమను మన కవులు, దర్శకులు ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. అదంతా థియరీ. ఎక్కువసార్లు పెళ్లి తర్వాతే ‘ప్రేమంటే’ అర్థమవుతుంది. ప్రేమ ఇంత బాగుంటుంది అనుకోవడం మొదలు.. ఇలా కూడా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించాం. అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఆనంది అద్భుతంగా నటించింది.
దర్శకుడు చాలా మెచ్యూరిటీ కథ రాసి, క్లారిటీగా తీశాడు. సునీల్, రామ్మోహన్ గార్లతో పాటు జాన్వి చాలా సపోర్టివ్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇద్దరు ప్రేమికులు ఎలా తమ సమస్యను పరిష్కరించుకున్నారనేది చూపించాం తప్ప ఎలాంటి సందేశం ఇవ్వలేదు. ఇక ‘అసమర్ధుడు’ అనే పొలిటికల్ డ్రామాతో పాటు ‘సుయోధన’ అనే థ్రిల్లర్‌లో నటిస్తున్నా.
నేను కాస్త విలక్షణమైన కథలు ఎంచుకుంటాననే గుర్తింపును ప్రేక్షకులు ఇచ్చారు. అ బాధ్యతతో సినిమాలు చేస్తున్నా. అలాగే నా ఐడియాలజీలను నేను పోషించే పాత్రలపై రుద్దదలుచుకోలేదు. మల్లేశం, బలగం, కోర్టు అలా వచ్చినవే. ఎవరైనా మీ స్టైల్‌లో సినిమా చేద్దామని వస్తే.. నాకేం స్టైల్ లేదు మీరు ఏదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్ అవుతుందని చెప్తుంటాను. ఏదైనా కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ అవుతుంది” అని చెప్పాడు.
