
హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం'. కోర్ట్ సక్సెస్ తర్వాత ఈ మూవీతో ఏప్రిల్ 25న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో రిలీజైన నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
సారంగపాణి జాతకం ఓటీటీ:
‘కోర్ట్’మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం ఓటీటీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
నేడు శుక్రవారం (మే 23న) తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా ప్రియదర్శి తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. కానీ, దర్శకుడు ఎంచుకున్న కథనంలో కొత్తదనం లేకపోవడంతో ఆశించినంత విజయం అందుకోలేకపోయింది.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష పండించిన కామెడీకీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. ఆలస్యం ఎందుకు చూసేయండి. ఇకపోతే ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మించారు. డీసెంట్ సంగీత సంచలనం వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
Recent Telugu Entertainer 😂 #SarangapaniJathakam (Telugu) streaming from Tonight on PrimeVideo in Telugu & Tamil !!#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @vennelakishore @harshachemudu @SrideviMovieOff #OTT_Trackers pic.twitter.com/UuKQOMflGY
— OTT Trackers (@OTT_Trackers) May 22, 2025
కథేంటంటే:
సారంగపాణి (ప్రియదర్శి) ఒక కార్ షోరూమ్లో సేల్స్ మాన్గా పనిచేస్తుంటాడు. అతనికి జాతకాల పిచ్చి. మూఢ నమ్మకాలను వీపరీతంగా నమ్మేస్తూ బ్రతుకుతాడు. చేతిరాతలే తన జీవితరాత అని ఉహించుకుంటాడు. ఉదయం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు చేసే ప్రతి పనిని జాతకం చూసుకునే చేస్తుంటాడు.
ఈ క్రమంలో తన షోరూమ్‌లోనే మేనేజర్‌గా పనిచేసే మైథలిని (రూప కొడవాయూర్) ఇష్టపడతాడు. మైథిలి కూడా సారంగపాణిని ప్రేమిస్తుంది. పెద్దలను ఒప్పించి మైథిలితో ఏడడుగులు వేయాలని సారంగపాణి అనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది.
ఆ టైంలోనే సారంగపాణి జీవితంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అలా ఆస్ట్రాలజర్ జిగేశ్వనంద్ (శ్రీనివాస్ అవసరాల)తో సారంగపాణికి పరిచయం ఏర్పడుతుంది.
ఆస్ట్రాలజర్ జిగేశ్వనంద్ చెప్పే ప్రతిమాటను సారంగపాణి తూచా తప్పకుండ పాటిస్తుంటాడు. అయితే, పెళ్లయ్యాక ఓ అనుకోని మర్డర్ కేసులో ఇరుక్కుంటావు అంటూ ముందే జాతకం చెప్పుతాడు ఆ ఆస్ట్రాలజర్ జిగేశ్వనంద్. ఇక పెళ్లయ్యాక హంతకుడి భార్య అనే ముద్ర 'తాను పెళ్లి చేసుకోబోతున్న మైథిలిపై' పడకూడదని ఆలోచిస్తాడు. అలా ముందే ఓ వ్యక్తిని మర్డర్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అందుకు తన ఫ్రెండ్ చందు (వెన్నెల కిశోర్) సాయం తీసుకుంటాడు. తాను మర్డర్ చేయాలి, కానీ చనిపోయిన వారి వల్ల సమాజానికి గానీ, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తాడు.
అయితే, ఒక ఫేమస్ హోటల్ ఓనర్ అహోబిల రావు (తనికెళ్ల భరణి)ని చంపమని జిగేస్వరానంద్ సలహా ఇస్తాడు. మరి అహోబిలరావును (తనికెళ్ల భరణి) చంపమని సారంగపాణికి జిగేశ్వరనంద్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చివరికి సారంగపాణి అతన్ని చంపడా? లేదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? జాతకాల పిచ్చి కారణంగా సారంగపాణి జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదర్కొన్నాడనేది మిగతా స్టోరీ.