మట్టి గణపతులనే పూజించాలె: ప్రియాంక అలా

మట్టి గణపతులనే పూజించాలె: ప్రియాంక అలా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని భక్తులకు  కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అలా విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్​లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులనే పూజించాలంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లను శనివారం  ఆమె ఆవిష్కరించారు. 

ALSO READ:  వినాయక చవితి.. విఘ్నేశ్వరుని కథ వినాల్సిందే..

ఈ సందర్భంగా  మాట్లాడుతూ రసాయనాలతో రూపొందించిన గణపతి విగ్రహాలను పూజించడం వల్ల వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రోగ్రాంలో  మండలి ఈఈ రవీందర్​, డీఆర్​ఓ రవీంద్రనాథ్​ పాల్గొన్నారు.