తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక అరుల్ మోహన్. తను హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయగా, సోమవారం నుంచి ప్రియాంక జాయిన్ అవుతోంది.
ఇందులో గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఆమెతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో నైట్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ లేకుండా ఇతర నటీనటులపై ఉన్న సన్నివేశాలను షూట్ చేసేలా ప్లాన్ చేశారు. అతి త్వరలోనే పవన్ కూడా సెట్‌లో జాయిన్ కానున్నారు. మరోవైపు తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసి.. ఫస్ట్ సాంగ్‌ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.