
కన్నడ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సౌత్‌లోని టాప్ హీరోలకు జోడీగా నటిస్తూ మంచి ఫామ్‌లో ఉన్న ఆమె.. ‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జంటగా కనిపించనుంది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి శనివారం ప్రియాంక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో ఆమె కన్మణి క్యారెక్టర్‌లో కనిపించనుందని రివీల్ చేశారు. అలాగే ఆమె పాత్రకు సంబంధించి రెండు స్పెషల్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక ట్రెడిషినల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ టీమ్ ‘ప్రతి తుఫానుకు ప్రశాంతత అవసరం దానికోసం కన్మణిని కలవాల్సిందే’ అంటూ పోస్ట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది. పవన్ పోషిస్తున్న ఓజాస్ గంభీరకు భార్య పాత్రలో తను కనిపించబోతోందని తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ సెకండ్ సాంగ్‌ను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.