Priyanka Chopra: హాలీవుడ్ టార్గెట్..బోర్న్ హంగ్రీ నిర్మాతగా ప్రియాంక చోప్రా

Priyanka Chopra: హాలీవుడ్ టార్గెట్..బోర్న్ హంగ్రీ నిర్మాతగా ప్రియాంక చోప్రా

అందం, నటన‌తో ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రియాంక చోప్రా.పదేండ్లు బాలీవుడ్ ను ఏలిన ఈ భామ ఏకంగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడా తన నటనా కౌశలంలో ఔరా అనిపించుకుంది. సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను మంచి పేరు తెచ్చుకుంది. యునిసెఫ్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గాను సేవ‌లందిస్తోంది. హాలీవుడ్ కి వెళ్లాక నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తింది.

ఇటీవ‌ల కంటెంట్ ఉన్న చిత్రాల‌తో నిర్మాత‌గా ఎదిగేస్తోంది.ఇప్ప‌టికే ప‌లు ప్ర‌యోగాత్మ‌క డాక్యు సిరీస్ లు, సినిమాల‌కు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అకాడమీ అవార్డ్-నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ 'టు కిల్ ఎ టైగర్' నుండి 'విమెన్ ఆఫ్ మై బిలియన్' వరకు ప్రియాంక ఇటీవల నిర్మాత‌గా పెట్టుబ‌డులు పెడుతోంది.కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొని వాటికి బ‌డ్జెట్ల‌ను స‌మ‌కూర్చ‌డం త‌న అభిరుచికి నిద‌ర్శ‌నం. 

ALSO READ;- ఏనుగు దాడి .. 80 ఏళ్ల అమెరికన్‌ టూరిస్టు మృతి

ఇప్పుడు బారీ అవ్రిచ్ 'బోర్న్ హంగ్రీ' ఈ లిస్ట్‌లో చేరింది. ప్రియాంక చోప్రా 'బోర్న్ హంగ్రీ' అనే చిత్రానికి నిర్మాతగా సంతకం చేసింది. ఈ అప్‌డేట్‌ని తన అభిమానులు అనుచరులతో ఇన్ స్టా వేదిక‌గా ప్రియాంక చోప్రా షేర్ చేసారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)