హర్యానాలో నిరుద్యోగం, అవినీతికి బీజేపీనే కారణం : ప్రియాంక గాంధీ

హర్యానాలో నిరుద్యోగం,  అవినీతికి బీజేపీనే కారణం :  ప్రియాంక గాంధీ

సిర్సా: హర్యానాలో నిరుద్యోగం, అవినీతికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. గురువారం ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘హర్యానాలో కాంగ్రెస్ వేవ్ వీస్తోంది. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఇక్కడే ఉంది. అందుకు ఈ ప్రాంతంలోని యువత మూల్యం చెల్లిస్తోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, అవినీతి, బీజేపీ ప్రభుత్వ అస్థిరతతో ప్రజలు విసిగిపోయారు. వారు రాష్ట్రంలో పెద్ద మార్పును తీసుకు రాబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని సీట్లను భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుచుకోనుంది” అని తెలిపారు. అంతకు ముందు సిర్సా నుంచి పోటీ చేస్తున్న పార్టీ  అభ్యర్థి కుమారి సెల్జాకు మద్దతుగా ప్రియాంక రోడ్ షో కూడా నిర్వహించారు.