మోదీ సర్కార్ భద్రతా వైఫల్యమే పహల్గాం ఉగ్రదాడి: ప్రియాంక గాంధీ

మోదీ సర్కార్ భద్రతా వైఫల్యమే పహల్గాం ఉగ్రదాడి: ప్రియాంక గాంధీ

పహల్గాం ఉగ్రదాడి పూర్తి మోదీ సర్కార్ భద్రతా వైఫల్యమే అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ. పహల్గాం దాడికి బాధ్యత వహించకుండా.. ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు. పాకిస్తాన్ లో కూర్చొని మనదేశంపై దాడి చేస్తే ఐబీ ఏం చేస్తోందని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి IB చీఫ్ రాజీనామా చేశాడా?..కేంద్ర హోంమంత్రి రిజైన్ చేశాడా?..ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? కనీస బాధ్యత కూడా హోంమంత్రి తీసుకోలేకపోయాడు అని విమర్శించారు ప్రియాంకగాంధీ. పహల్గాం దాడికి ఎవరూ బాధ్యత వహిస్తారో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు ప్రియాంక గాంధీ. 

కాశ్మీర్ లో పరిస్థితులు మారిపోయాయని కేంద్ర గొప్పలు చెప్పుకుంటోంది.. నిజంగా మారిపోతే పహల్గాంలో ఉగ్రదాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. భార్య చూస్తుండగానే భర్తను దారుణంగా చంపేశారు. ఉగ్రదాడిని ముందే గుర్తించేంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ  లేదా?..పహల్గాం ఉగ్రదాడి ఇంటెలిజెన్స్ వైఫల్యం అవునా కాదా?  అని మోదీ సర్కార్ ను నిలదీశారు. గెలుపైనా ఓటమైనా బాధ్యత తీసుకోవడం గొప్పతనం.. కేంద్రం  బాధ్యతతీసుకోకుండా TRF పై తోసేసిందన్నారు ప్రియాంకగాంధీ.  

►ALSO READ | పాక్‎ను ఖండించే ఒక్క దోస్తు మోడీకి లేరా..? సభలో చర్చ జరుగుతుంటే విదేశాలకు పోతారా: కనిమొళి

అధికార పార్టీకి జనంపై ధ్యాస లేదు. అన్ని రాజకీయాలే చేస్తోందన్నారు ప్రియాంకగాంధీ. దేశంలో చెలరేగిన హింసాకాండను,అల్లర్లను కట్టడి చేయడంతో హోమంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారన్నారు.మణిపూర్, ఢిల్లీతో సహా దేశంలో అల్లర్లను కట్టడి చేయడంతో హోంమంత్రి విఫలమయ్యారని విమర్శించారు.  

యుద్దాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఎలా చెప్తారు..పాక్ ఆర్మీ జనరల్ వైట్ హౌస్ లో ట్రంప్ తో లంచ్ మర్మమేంటనని కేంద్రాన్ని నిలదీశారు ప్రియాంకగాంధీ. పహల్గాం ఉగ్రదాడి బాధితుల తరపున నేను మాట్లాడుతున్నా..అధికార పార్టీకి ప్రజలపై ధ్యాస లేదు..అన్ని రాజకీయాలే చేస్తోంది. ఎన్డీయే పాలనలో పబ్లిసిటీ తప్పా .. పాలన లేదని.. మోదీ సర్కార్ ఎన్ని ఆపరేషన్లు చేసినా.. నిజాన్ని దాచలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ తీవ్రంగా విమర్శించారు.