ప్రియాంక దెబ్బ అదుర్స్ కదూ.. అమర్కు ఊహించని షాక్!

ప్రియాంక దెబ్బ అదుర్స్ కదూ.. అమర్కు ఊహించని షాక్!

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ట్విస్టులతో ఆడియన్స్ కు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. చిత్ర విచిత్రమైన టర్న్స్ తీసుకున్న ఈ షో ఇప్పుడు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఎనిమిది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో విజేత‌ ఎవ‌రు కానున్నాను అనేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఫినాలే లో అందరికన్నా ముందు అడుగుపెట్టేందుకు ఉపయోగపడే టికెట్ టూ ఫినాలే టాస్క్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇది గెలిచినా వారు డైరెక్ట్ గా టాప్ 5కి చేరుకుంటారు. ఇందులో భాగంగా గేమ్స్ కూడా మొదలుపెట్టేశాడు. అందులో మొదటి టాస్క్ అర్జున్, రెండో టాస్క్‌లో ప్ర‌శాంత్, మూడో టాస్క్‌లో అర్జున్‌, నాలుగో టాస్కులో ప్ర‌శాంత్ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జరిగిన ఐదవ టాస్క్‌లో అమ‌ర్‌దీప్ విజేత‌గా నిలిచాడు.

దీంతో త‌క్కువ పాయింట్లు ఉన్న‌వారు ఫినాలే రేస్ నుండి అవుట్ అయ్యారు. అందులో శివాజీ, శోభ‌, ప్రియాంక ఉన్నారు. అందులో చివరగా గేమ్ నుండి బయటకు వచ్చిన ప్రియాంకను త‌న పాయింట్స్ రేస్ లో ఉన్న ఒకరికి ఇవ్వాల్సిందిగా బాగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ప్రియాంక తన పాయింట్స్ ను అమ‌ర్‌కు కాకుండా గౌత‌మ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అవ్వాకయ్యాడు అమర్. తన ఫ్రెండ్ అనుకున్న ప్రియాంక తనకు కాకుండా గౌతమ్ కు ఇవ్వడంతో హార్ట్ అయ్యాడు. నిన్న గేమ్ లో తన నుండి బాల్ లాక్కున్న అమర్ కు ఇలా సాలిడ్ కౌంటర్ ఇచ్చింది ప్రియాంక అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.

Also Read:-విమానంలో  భార్య భర్తలు ఫైటింగ్​... ఎమర్జన్సీ ల్యాండింగ్​