Priyanka Jain: తడిచీరలో ప్రియాంక జైన్ అందాల ఆరబోత.. వీడియో వైరల్

Priyanka Jain: తడిచీరలో ప్రియాంక జైన్ అందాల ఆరబోత.. వీడియో వైరల్

ప్రియాంక జైన్(Priyanka Jain).. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ తో బుల్లితెరలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టింది ఈ ముంబై బ్యూటీ. అంతేకాదు.. తన ఆటతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె టాప్ 5 వెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా నిలిచింది.

ఇక బుల్లితెరలో సంప్రదాయంగా, పద్దతిగా కనిపించిన ఆమె బిగ్ బాస్ లో గ్లామర్ షోతో ఆడియన్స్ కు షాకిచ్చింది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని గ్లామర్ షోకు సిద్ధం అనే సంకేతాలు ఇచ్చింది. తాజాగా మరోసారి తన అందాలతో ఆడియన్స్ కు విందు ఇచ్చింది. తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పర్పుల్ కలర్ చీరలో, తడిసిన అందాలను ప్రదర్శిస్తూ గ్లామర్ తో రచ్చ చేసింది ప్రియాంక. ఈ వీడియోకి.. ఆర్టిస్ట్‌గా నాలోని భిన్నమైన షేడ్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్న.. అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ప్రియాంకలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్, షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఒక్క వీడియోతో గ్లామర్ షోకి తాను సిద్దమే అనే సంకేతాలు ఇచ్చింది ప్రియాంక. మరి ఈ వీడియో తరువాత అయినా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.