
నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియంకా అరుళ్ మోహన్.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా మరో మూవీలో చాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ 68వ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకను ఫిక్స్ చేశారని కోలీవుడ్ టాక్.
ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా సెట్స్ కు వెళ్లబోతుందన్నారు మేకర్స్. ఇందులో జ్యోతిక కూడా కీలకపాత్ర పోషించనుంది. మరోవైపు ప్రియాంక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంతో పాటు, ధనుష్కి జంటగా ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తోంది.