PBKS vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఇన్సింగ్స్ మొదటి ఓవర్లనే ఏకంగా 22 పరుగులు రాబట్టారు. ఇక యువ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. అతని మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 2.4 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 50 పరుగుల మైలురాయిని అందుకుంది. టీ20 క్రికెట్‌లో ఇది అత్యంత వేగవంతమైన స్కోరింగ్‌లో ఒకటిగా నిలిచింది. పవర్ ప్లేను పంజాబ్ బ్యాటర్లు పూర్తిస్థాయిలో వాడుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
ప్రియాంష్ ఆర్య కిరాక్ హాఫ్ సెంచరీ:
క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే దూకుడు మొదలు పెట్టిన ప్రియాంష్ ఆర్య, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుని తన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 6 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టిన తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్ లో సాహిల్ ప్రకాష్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరగా, మరోవైపు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18) కూడా ముకేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇక క్రీజులో శ్రేయస్ అయ్యర్ (13 ), కూపర్ కొన్నోలీ (5 ) ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముకేష్ కుమార్, మాధవ్ తివార్ తలో వికెట్ పడగొట్టారు.
