
దుబాయ్: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ విన్నర్‌కు రూ. 13 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇందులో సగం దక్కనుంది. ఈ మేరకు టోర్నీ ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 45.56 కోట్లు. సెమీస్‌లో ఓడిన టీమ్స్‌కు రూ. 3.25 కోట్లు లభిస్తాయి. సూపర్–12లో ఓడిన 8 జట్లకు రూ. 57 లక్షల చొప్పున అందజేస్తారు. ఈ నెల 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ టోర్నీ జరగనుంది.