
హైదరాబాద్, వెలుగు : వరుసగా రెండో టైటిల్‌పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో పట్నా పైరేట్స్‌తో పుణెరి పల్టన్ తలపడనుంది. తొలి ఎడిషన్‌తో పాటు గత సీజన్ విజేతగా నిలిచిన జైపూర్ లీగ్ దశలో టాప్–2లో
నిలిచి నేరుగా సెమీస్ చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన స్టీలర్స్ మొదటిసారి సెమీస్‌లో అడుగు పెట్టింది. గ్రూప్ దశలో టాప్ ప్లేస్ సాధించిన పుణెరి అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆశిస్తోంది.