ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7: జులై 20 నుంచి

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7: జులై 20 నుంచి

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (PKL) ఏడవ సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జులై 20న ప్రారంభమవుతుందని లీగ్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ఆరంభమవుతాయన్నారు. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి, సిద్దార్ద్‌ దేశాయ్ మోను గోయత్‌, సందీప్‌ నర్వాల్‌ వంటి పలువురు ఈ సీజన్‌లో కొత్త జట్లకు ఆడుతున్నారు.

బెంగళూరు బుల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత సీజన్‌-6లో స్టార్‌ రైడర్‌ అజయ్ ఠాకూర్‌ నేతృత్వంలోని బెంగళూరు బుల్స్‌ విజేతగా నిలిచింది. గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 38-33తో తేడాతో బెంగళూరు విక్టరీ సాధించి కప్‌ దక్కించుకుంది.