
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్, 2026 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం 386శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో ఉన్న రూ. 7 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు పెరిగింది. ఈ లాభం వృద్ధికి ప్రధాన కారణం ఆదాయం పెరగడం, ప్రాజెక్టుల పూర్తి కావడమని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం గత సంవత్సరం రూ. 400 కోట్ల నుంచి 118శాతం పెరిగి రూ. 870 కోట్లకు చేరింది. ఈసారి మొత్తం 15.7 మిలియన్ చదరపు అడుగుల స్థిరాస్తిని అభివృద్ధి చేసి కస్టమర్లకు అప్పగించామని సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది.