కోతుల సమస్య.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

కోతుల సమస్య.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి కోతుల సమస్య. కోతుల బెడదకు పరిష్కారం చూపాలని ఎన్ని సార్లు అధికారులకు, గ్రామస్తులు మొరపెట్టుకున్నా అది కేవలం హామీలకే పరిమితమవుతోంది. ఇలాంటి సమస్యనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలోనూ ఉంది. గత కొన్ని రోజులుగా కోతుల చేష్టలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ఊరి ప్రజలు.. కోతుల బెడుదల నుంచి విముక్తి చేయాలంటూ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ క్రమంలో అక్కడే కూర్చొని కొందరు యువకులు ఆందోళన చేశారు. ఎమ్మార్వో గానీ లేదా సర్పంచ్ గానీ ఎవరో ఒకరు వస్తే గానీ తాము వెనక్కి తగ్గమని, వారు వచ్చి ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్పాలని డిమాండ్ చేశారు.  దాంతో ఆగకుండా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అవసరమైతే ప్రాణాలనా అర్పిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు.