వర్సిటీల్లో వీసీలు వచ్చి ఏడాదైనా మారని పరిస్థితి

వర్సిటీల్లో వీసీలు వచ్చి ఏడాదైనా మారని పరిస్థితి
  • వీసీలు వచ్చి ఏడాదైనా మారని పరిస్థితి
  • కొత్త కోర్సులు పెట్టకపోగా.. ఉన్న కోర్సులకు ఎసరు
  • వివాదాస్పదమవుతున్న సర్క్యులర్లు
  • ఇష్టారాజ్యంగా ట్యూషన్ ఫీజుల పెంపు 

 

రేకుల షెడ్లలో హాస్టళ్లు

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో హాస్టళ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఓయూలో దశాబ్దాల కాలం నాటి రేకుల షెడ్డుల్లోనే హాస్టళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ జీతాలకే సరిపోక కొత్త హాస్టళ్ల నిర్మాణానికి వైస్ చాన్స్​లర్లు సాహసించడం లేదు. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కాలేజీ, హాస్టళ్లు పాత భవనాలు, రేకులషెడ్లలో కొనసాగుతున్నాయి. నల్గొండలోని మహత్మాగాంధీ వర్సిటీ, మహబూబూనగర్ లోని పాలమూరు వర్సిటీలో హాస్టళ్లు, క్లాస్ రూమ్ ల కొరత వేధిస్తున్నది. బాచుపల్లిలో ఉన్న తెలుగు యూనివర్సిటీ హాస్టళ్ల పనులు నిధుల కొరత కారణంగా పూర్తికాక కనీస వసతులు కరువయ్యాయి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్​లర్లను నియమించి ఏడాదైనా పరిస్థితి మారడం లేదు. అనేక సమస్యలతో వర్సిటీలు కొట్టుమిట్టాడుతున్నాయి. వీసీలు జారీ చేస్తున్న  సర్క్యులర్లు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. దీంతో విద్యార్థులు రోడ్డెక్కాల్సి వస్తున్నది. ఒకప్పుడు విద్యాప్రమాణాలకు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట టీచింగ్ పోస్టుల ఖాళీల కారణంగా నానాటికీ మసకబారుతున్నది. సీనియర్ ప్రొఫెసర్లు నెలకు ఐదారుగురు రిటైర్ అవుతుండడంతో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని పీజీ కాలేజీల్లో లెక్చరర్లు లేక క్లాసులు వినకుండానే విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తున్నది. తెలుగు యూనివర్సిటీతోపాటు తెలంగాణ, మహత్మాగాంధీ, శాతావాహన, పాలమూరు వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కొరత వేధిస్తున్నది.  

వివాదాల్లో వీసీలు

  • యూనివర్సిటీల పాలన పగ్గాలు చేపట్టిన వైస్ చాన్స్ లర్లు అకడమిక్ ప్రమాణాల గురించి పట్టించుకోకుండా.. అకడమికేతర అంశాలపై దృష్టి సారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టగానే.. క్యాంపస్ లోకి వచ్చే వాకర్స్ ఫీజు చెల్లించాలని జారీ చేసిన  సర్క్యులర్  అప్పట్లో కలకలం రేపింది. కోఠి, నిజాం, సైఫాబాద్ లో చదివే డిగ్రీ విద్యార్థుల హాస్టళ్ల మూసివేత, కాంట్రాక్ట్ లెక్చరర్ల ఓరల్ ట్రాన్స్ ఫర్స్, రెగ్యులర్ ప్రొఫెసర్ల ఆస్తుల ప్రకటనల్లాంటి నిర్ణయాలను అమలు చేయాలని ప్రయత్నించి.. విద్యార్థి, అధ్యాపక సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గారు. పార్ట్ టైం టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్  నేత  రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఓయూ క్యాంపస్ అట్టుడికింది. వందేమాతరం ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అనేక పోరాటాలకు, సిద్ధాంత చర్చలకు వేదికగా నిలిచిన  ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని, కనీసం బ్యానర్ కూడా కట్టొద్దని వైస్​ చాన్స్​లర్​ సర్క్యులర్ జారీ చేయడంపై స్టూడెంట్​ యూనియన్లు​ భగ్గుమంటున్నాయి.
  • రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరొందిన కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్​ నియామకంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించారంటూ ఇప్పటికే హైకోర్టులో ఒక కేసు, లోకాయుక్తలో మరో కేసు నమోదయ్యాయి. వీసీగా రమేశ్​ బాధ్యతలు చేపట్టిన మొదటి 4 నెలల్లోనే ఇద్దరు రిజిస్ట్రార్లు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్​గా ఉన్న ప్రొఫెసర్​ మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్ మామిడాల ఇస్తారి తమ పదవులకు రాజీనామా చేశారు. వీసీ ఏకపక్ష విధానాల వల్లే  పరిపాలన పదవుల్లో కొనసాగేందుకు సీనియర్ ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీసీగా బాధ్యతలు చేపట్టాక ట్యూషన్ ఫీజులను భారీగా పెంచారు. దీంతో విద్యార్థులు వీసీ చాంబర్ ముట్టడించినా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివే వారికి హాస్టల్ ఫెసిలిటీ లేదని, హాస్టళ్లు ఖాళీ చేయాలని సర్క్యులర్ జారీ చేయడంతో స్టూడెంట్స్ ఉద్యమించారు. దీంతో ఆ సర్క్యులర్ వెనక్కి తీసుకున్నారు. ఇటీవల సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుండగానే హాస్టళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో మరోసారి వీసీ ఆఫీసును విద్యార్థులు ముట్టడించడంతో ఆ సర్క్యులర్​ను కూడా వెనక్కి తీసుకున్నారు. అలాగే ఈ వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీవీ విజ్ఞాన పీఠం బ్యానర్ల మీద తప్ప ఎక్కడా కనిపించడం లేదు. 8 నెలలైనా ఈ పీఠానికి ఓ డైరెక్టర్​ను గానీ, బిల్డింగ్​ను గానీ కేటాయించలేదు. గ్రూప్స్ కోచింగ్ ఒక్క రోజుతోనే ఆపేశారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీని, విద్యార్థులకు హాస్టల్స్ నిర్మిస్తానని బాధ్యతలు చేపట్టినప్పుడే ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పునాది కూడా తీయలేదు. వర్సిటీలో కోర్సుల బలోపేతంపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆర్టికల్స్ రాయడం, వారితో వర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహించడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
  • నిజామాబాద్​లోని తెలంగాణ యూనివర్సిటీలోనూ కేయూలో మాదిరిగానే మొదటి 6 నెలల్లో ముగ్గురు రిజిస్ట్రార్లు మారారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే వీసీ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ కనకయ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) ఇందుకు రిజిస్ట్రార్ కనకయ్యను బాధ్యుడిగా చేస్తూ ఆయనను పదవీ బాధ్యతల నుంచి తప్పించి, సీనియర్  పొఫెసప యాదగిరిని నియమించింది. జరిగిన నియామకలను రద్దు చేసింది. తర్వాత యాదగిరి స్థానంలో కొత్త రిజిస్ట్రార్​గా శివ కుమార్ వచ్చారు. 

పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే క్లాసులు

  •  రాష్ట్రంలోని 11 స్టేట్​ యూనివర్సిటీల్లో కలిపి టీచింగ్​ శాంక్షన్డ్ పోస్టులు 2,828 ఉండగా.. వాటిలో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మూడింట రెండొంతుల పోస్టుల్లో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లే అరకొర జీతాలతో కొనసాగుతున్నారు. ఐదేండ్ల క్రితమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు హడావుడి చేసిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఆ ప్రక్రియను ప్రారంభించలేదు.
  •  వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకతీయ వర్సిటీలో ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్, సోషల్ వర్క్, జర్నలిజం, సైకాలజీ, టూరిజం  విభాగాల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు లేరు. ఎడ్యుకేషన్​లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక ఇటీవల ఎంఈడీ కోర్సు రద్దయింది. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ, కొత్తగూడెం ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  •     నిజామాబాద్​లోని తెలంగాణ వర్సిటీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాకల్టీ లేరు. మొత్తం 152 పోస్టులకు 69 మందే ఉన్నారు. 
  •  కరీంనగర్​లోని  శాతవాహన వర్సిటీలో తెలుగు, మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేరు. 
     
  •  నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో చాలా విభాగాల్లో ఒక్కో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉన్నారు. ఇంజనీరింగ్​లో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  •   హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి ముగ్గురే ప్రొఫెసర్లే ఉన్నారు. ఇందులో ఒకరు రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మరొకరు కంట్రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పనిచేస్తున్నారు. 
  •    మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పాలమూరు వర్సిటీలో ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ, ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ, ఎంబీఏ డిపార్ట్మెంట్లను కాంట్రాక్ట్, పార్ట్ టైం ఫ్యాకల్టీతోనే నడుపుతున్నారు. 


భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజులు

కొత్త వీసీలు వచ్చాక డిగ్రీ, పీజీ విద్యార్థులపై ఫీజుల భారం మోపారు. పీజీ రెగ్యులర్‍, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్‍ ఫీజులను భారీగా పెంచారు. గతంలో రూ.2,410 ఉన్న ఎంఏ కోర్సు ఏడాది ఫీజును రూ.14 వేలు చేశారు. జేఎన్​టీయూ పరిధిలో బీటెక్​కు రూ. 44 వేలు ఉండే.. రూ.70 వేలు చేశారు. పెరిగిన ఫీజులకు తగ్గట్టు ఫీజు రీయింబర్స్​మెంట్ రాకపోవడంతో అదనపు భారాన్ని విద్యార్థులే భరించాల్సి వస్తున్నది. 

విద్యార్థుల గొంతు నొక్కుతున్నరు

ఓయూ అభివృద్ధి కోసం ఏడాదిలో వీసీ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. తక్కువ ధరలకు వర్సిటీ భూములను లీజుకిచ్చేస్తూ వర్సిటీని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అకడమిక్ విషయాలు పట్టించుకోకుండా ఓయూలో ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వీసీ పని చేస్తున్నారు.  
- కాంపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ, ఏఐఎస్ఎఫ్, ఓయూ

ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం లేదు 

కేయూ వీసీ ప్రొఫెసర్ రమేశ్​ బాధ్యతలు చేపట్టగానే వర్సిటీ భూములను కాపాడి ప్రహరీ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ప్రహరీ నిర్మాణం చేయలేదు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని కేయూ భూములను కాపాడాలి. సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు నోటిఫికేషన్ ఇచ్చి రెండేండ్లయినా ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు.   
- డాక్టర్ మామిడాల ఇస్తారి, జనరల్ సెక్రెటరీ,  అసోసియేషన్​ ఆఫ్​ కేయూ టీచర్స్​(అకుట్)


యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఖాళీలు

ఉస్మానియా             2,075
కాకతీయ                     174
మహాత్మాగాంధీ            09
తెలంగాణ                    09
శాతవాహన                   58
పాలమూరు                 14
పీఎస్టీయూ                  84
బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏవోయూ           90
జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     15
ఆర్జీయూకేటీ               93
జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ        53