- జూబ్లీహిల్స్‌లో కారుకు, బుల్డోజర్‌కు మధ్య పోటీ: కేటీఆర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఎన్టీఆర్కాంస్య విగ్రహం పెట్టి.. మాగంటి సునీత చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. ఈ ఎన్నిక కారుకు, బుల్డోజర్‌కు మధ్య పోటీ అని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని వెంగల్‌రావు నగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఎకానమిక్ ఇంజిన్‌గా మార్చామని వివరించారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దెబ్బకు హజారుద్దీన్‌ను మంత్రి చేశారన్నారు. రెండేండ్లుగా టైమ్‌పాస్ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.
‘‘ఈ ఎన్నిక కేవలం అభ్యర్థులకు మాత్రమే కాదు. బీఆర్‌ఎస్ పార్టీకి కూడా. కాంగ్రెస్ విధ్వంసం ఆగాలంటే ఆ పార్టీని ఓడించాలి. ఇండ్లపైకి బుల్డోజర్‌లు రావొద్దంటే కాంగ్రెస్‌ను ఓడించాలి. మాగంటి సునీతను గెలిపించాలి”అని కేటీఆర్పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు.
