ఓమాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌ హర్మన్‌‌‌ ప్రీత్ కౌర్‌‌‌‌

ఓమాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌ హర్మన్‌‌‌ ప్రీత్ కౌర్‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్​ ఓమాక్స్..​ ఆటలను, అథ్లెట్లను ప్రోత్సహించడంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌‌‌‌ ప్రీత్ కౌర్‌‌‌‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా నియమించింది. ఈ సందర్భంగా  కౌర్​ మాట్లాడుతూ, పంజాబ్‌‌‌‌లో ఓమాక్స్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. మెరుగైన సౌకర్యాలు క్రీడలను ఎలా ప్రోత్సహిస్తాయో ఢిల్లీలోని ఓమాక్స్ ఎస్టేట్ వంటి ప్రాజెక్టులు చూపిస్తాయని ఆమె తెలిపారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని  ఓమాక్స్​ ఎండీ మోహిత్ అన్నారు.