దివీస్ ల్యాబ్స్ లాభం రూ. 689 కోట్లు

దివీస్ ల్యాబ్స్ లాభం రూ. 689 కోట్లు

న్యూఢిల్లీ: దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్‌కు రెండో క్వార్టర్ (ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన) లో రూ. 689 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది గత సెప్టెంబరు క్వార్టర్​తో పోలిస్తే 35 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో లాభం రూ. 510 కోట్లు ఉండేది.

రెండవ క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,715 కోట్లు. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,338 కోట్లు ఉండేది. ఈ క్వార్టర్​లో కంపెనీకి రూ. 63 కోట్లు ఫారెక్స్ లాభం వచ్చింది. హైదరాబాద్​కు చెందిన దివీస్ లేబొరేటరీస్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌‌‌‌గ్రిడియెంట్స్, న్యూట్రాస్యూటికల్స్​తయారు చేస్తుంది.